NGKL: కల్వకుర్తి మండలం బెక్కరలోని నర్సరీని సర్పంచ్ దార భీమమ్మ బాలనాగయ్య శనివారం సందర్శించారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. నాటిన మొక్కలు ఏపుగా పెరిగేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ నరేందర్, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.