MDK: తూప్రాన్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో మనోహరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. వైద్య శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి ప్రారంభించగా, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు.