KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని SMT కాలనీలో సీపీఐ ఆధ్వర్యంలో గడపగడపకు కార్యక్రమం 7వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా నాయకులు ఎమ్మిగనూరులో నిర్మించిన టిడ్కో గృహాలను కనీసం ఈ ఉగాది నాటికైనా అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలను బలపరచడానికి ప్రజలు విరివిగా విరాళాలు ఇవ్వాలని సీపీఐ నాయకులు విజ్ఞప్తి చేశారు.