NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో గోడ ధ్వంసం కాగా, సుమారు రూ.70 వేల నష్టం వాటిల్లిందని హెచ్ఎం శ్రీధర్ తెలిపారు. పాఠశాల వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంతో, సర్వీస్ రోడ్డులోని షాపులో కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు హెచ్ఎం పేర్కొన్నారు.