NGKL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శివకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపును సర్పంచ్ జోగు రమణమ్మ శనివారం ప్రారంభించారు. వైద్యులు పలువురుకి టీబీ, క్షయ వంటి తదితర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.