కృష్ణ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి పవన్ కళ్యాణ్‌కు కానుకగా ఇవ్వాలని జనసేన నేత చలమలశెట్టి రమేశ్ బాబు పిలుపునిచ్చారు. శనివారం బాపులపాడులో భారీగా చేరికలు జరగ్గా.. కార్యకర్తలంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో MP బాలశౌరి, NTR జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను తదితరులు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.