సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గంలోని 44,348 మంది రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద రూ. 26.10 కోట్ల నగదును ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి విడుదల చేశారు. బుక్కపట్నంలో జరిగిన కార్యక్రమంలో జేసీ మౌర్య భరద్వాజ్, ఆర్డీవో సువర్ణతో కలిసి ఆమె పాల్గొన్నారు. మూడో విడతగా రైతుల ఖాతాల్లో రూ.6 వేలు జమ చేశామని ఎమ్మెల్యే తెలిపారు.