TG: యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడటంతో హైదరాబాద్ హోటళ్లు, హాస్టళ్లు కట్టెల పొయ్యిల బాట పట్టాయి. గతంలో 10 క్వింటాళ్లు అమ్ముడయ్యే కట్టెలు ఇప్పుడు ఏకంగా 50 క్వింటాళ్లకు చేరాయి. ధర కూడా క్వింటాకు రూ. 1200 నుండి రూ. 2000 వరకు పెరిగింది. గ్యాస్ దొరక్కపోవడంతో నగర వ్యాపారులు కట్టెల మండిల వద్ద బారులు తీరుతున్నారు.