ATP: గుమ్మఘట్ట మండలం వీరాపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం మూడవ విడత కార్యక్రమంలో MLA కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా 42,533 రైతు కుటుంబాలకు సుమారు రూ.25 కోట్లు కూటమి ప్రభుత్వం నేరుగా ఖాతాల్లో జమ చేసింది. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.