RamSkanda: బోయపాటి శ్రీను(Boyapati Srinu) హీరో రామ్(Ram Potineni) కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై సినిమా అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. సినిమా పేరును అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాకు స్కంద(Skanda) అనే పేరును ఖారారు చేశారు. ది ఎటాకర్ అనేది ట్యాగ్ లైన్. శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హీరో రామ్ కెరియర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం కావడంతో అభిమానుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక టైటిల్ తో పాటు ఓ వీడియో గ్లింప్స్(video glimps) ను కూడా విడుదల చేశారు మేకర్స్.
మీరు దిగితే ఊడేదుండదు..నేను దిగితే మిగిలేది ఉండదు అంటు బోయాపాటి మాస్ పవర్ ను రామ్ పోతినేని తన డైలాగ్ తో చూపించారు. ఇక గ్లింప్స్ చూస్తుంటే రామ్ అభిమానులకు మాస్ జాతర మొదలు అవుతుందని తెలుస్తుంది. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రాస్ గా నిలిచిపన బోయపాటి శ్రీను.. అఖండ(Akhanda) సినిమా తరువాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో మాస్ లుక్ లో కనిపించాడానికి హీరో రామ్ చాలానే కష్టపడ్డట్లు తెలుస్తుంది. ఎనర్జీటిక్ హీరోగా పేరున్న రామ్ సరసన అంతే ఎనర్జీటిక్ హీరోయిన్ శ్రీలీల(sreeleela) నటిస్తుంది. ఇక టైటిల్ కు తగ్గట్టుగానే సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్(Ismart Shankar) సినిమాతో తనలోని మాస్ ని బయటకు తీసిన రామ్ పోతినేని స్కంద(Skanda) సినిమాతో రామ్ లోని మరింత మాస్ ని చూపించబోతున్నారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ సినిమాకి తమన్(Thaman) సంగీతాన్ని అందిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.