ప్రకాశం: బేస్తవారిపేటలో బుధవారం రాత్రి ఎస్ఐ రవీంద్రారెడ్డి నైట్ బీట్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,రాత్రి సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను నిలదీసి, సాంకేతిక పరిజ్ఞానంతో వారి వివరాలు, వేలిముద్రలు పరిశీలిస్తూ నేరాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.