భీమవరం(Bhimavaram)లో ఓడిపోయినా తాను పట్టించుకోలేదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వారాహి యాత్ర(Varahi Yatra)లో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. తెలుగు జాతికి పోరాట స్ఫూర్తిని గుండెల్లో నింపిన అల్లూరి సీతారామరాజు గారికి శతకోటి వందనాలు అంటూ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తన ప్రసంగం ప్రారంభించారు. 56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు గారికి, నేను మొదట భారతీయుడ్ని అని చెప్పిన అంబేద్కర్ (Ambedkar) గారికి శతకోటి వందనాలు అని తెలిపారు. మనకు ఓటమి, గెలుపు ఉండవు ప్రయాణమో ఉంటుందన్నారు.
అమ్మఒడి సభలో తన వైవాహిక జీవితంపై సీఎం జగన్ (CM JAGAN) చేసిన ఘాటు వ్యాఖ్యలకు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. మిస్టర్ జగన్… చెవులు విప్పుకుని విను. నా వ్యక్తిగత జీవితం (personal life) గురించి మాట్లాడుతున్నావు నీ వ్యక్తిగత జీవితంలో ప్రతిక్షణం నాకు తెలుసు మాట్లాడమంటావా? మీ నాయకులు ఎవరినైనా పంపించు చెబుతాను! నీ వ్యక్తిగత జీవితం గురించి నేను చెప్పేది వింటే చెవుల్లోంచి రక్తం వస్తుంది జాగ్రత్త! అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. “జగన్ నీకే చెబుతున్నా. నువ్వు ఇలాగే వ్యక్తిగత జీవితాల గురించి పనికిమాలిన మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోను. ఇది గట్టి వార్నింగ్ అనుకో. బలమైన పోరాటం ఇవ్వబోతున్నాం… సిద్ధంగా ఉండు” అని పవన్ స్పష్టం చేశారు. గతంతో పోల్చితే తమ వాళ్లు బైక్ సైలెన్సర్లు తీసేసి తిరగడం తగ్గిందని, వైసీపీ నేతల నోట్లో సైలెన్సర్లు తగ్గిస్తే తమ వాళ్లు పూర్తిగా తగ్గిస్తారని పవన్ అన్నారు