ప్రకాశం: రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మూడవ విడత రైతు ఖాతాలో 6000 జమ చేస్తున్నామని మంత్రి స్వామి అన్నారు. ఈ సాయంతో రైతులకు ఏటా 20 వేల చొప్పున ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. విత్తనం నాటే దశ నుంచి పంట విక్రయం వరకు ప్రతి అడుగులోనూ కూటమి ప్రభుత్వం రైతన్నకు అండగా ఉంటుందని తెలిపారు.