BPT: కొల్లూరు పట్టణంలోని లాక్ సెంటర్ వద్ద నేతివారి చెరువు వెనుక భాగంలో ఉన్న మురుగు కాలువలో నీరు నిలిచిపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు వాపోతున్నారు. దీంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మురుగు వల్ల దోమల బెడద ఎక్కువైందన్నారు. సంభందిత అధికారులు వెంటనే డ్రైనేజీని శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు.