NDL: దొర్నిపాడు మండలంలో ఈనెల 16 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమవుతున్నట్లు MEO మనోహర్ రెడ్డి తెలిపారు. పది పరీక్షల కారణంగా దొర్నిపాడు జడ్పీ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు పాఠశాల ఉంటుందన్నారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు బడిలో తరగతులు ఉంటాయన్నారు.