VZM: మెంటాడ మండలం ఆండ్ర పంచాయతీ లోతుగెడ్డ గ్రామంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. అడ్డాల చిన్నమ్మికి చెందిన ఇల్లు మంటల్లో దగ్ధమైంది. మధ్యాహ్నం వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినట్లు బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 80 వేల విలువైన వస్తువులు, డబ్బులు కాలిపోయినట్లు అంచనా. గ్రామస్తులు సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.