JGL: నీరా కేఫ్ నిర్వహణను లీజుకు ఇచ్చేందుకు గీత కార్మిక సహకార సంఘాల నుంచి బిడ్ల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. 2026 జనవరి 1 నాటికి నమోదైన సంఘాలు అర్హులని పేర్కొన్నారు. గీత కార్మికుల ఆర్థిక పురోభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ కేఫ్‌ను నిర్మించిందని, ఆసక్తి గల సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.