BPT: యద్దనపూడి మండలానికి చెందిన 427 మంది రైతుల ఖాతాల్లో ఇవాళ అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.1.69 కోట్లు జమ కానున్నాయని వ్యవసాయ అధికారి కుమారి తెలిపారు. అలాగే పీఎం కిసాన్ కింద 3,784 మందికి రూ.76 లక్షలు జమ అవుతాయని చెప్పారు. ఇంకొల్లులో నిర్వహించే కార్యక్రమంలో ఎమ్మెల్యే సాంబశివరావు పాల్గొంటారని వెల్లడించారు.