BHNG: యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెంలో రైతులకు మెరుగైన విద్యుత్ సౌకర్యం అందించేందుకు నిర్మించిన నూతన కరెంట్ సబ్‌స్టేషన్‌ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.