AP: దేశంలో ఐటీఐల ఆధునీకరణకు రూ.60 వేల కోట్ల బడ్జెట్తో ‘పీఎం-సేతు’ పథకాన్ని కేంద్రం రూపకల్పన చేసింది. కోర్సు పూర్తి కాగానే ఉద్యోగ కల్పన ఈ పథకం లక్ష్యం. దీనిలో ‘హబ్ అండ్ స్పోక్’ విధానంలో, అంతర్జాతీయ ప్రమాణాలతో ITI విద్యార్థులకు సరికొత్త సాంకేతిక శిక్షణ అందిస్తారు. వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో భాగంగా ITIలను కేంద్రం బలోపేతం చేస్తోంది. దీనిలో భాగంగా ఈ పథకం తీసుకొచ్చింది.