KNR: శంకరపట్నం మండలం వంకాయగూడెం అయ్యప్ప కాలనీ పరిధిలో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. చెక్ డ్యాం నిర్మాణ పనుల కోసం వెళ్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బీహార్ రాష్ట్రానికి చెందిన డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. తోటి కార్మికులు వెంటనే స్పందించి అతడిని కరీంనగర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.