RR: షాద్నగర్ నియోజకవర్గంలోని పల్లె సీమల రూపురేఖలు మార్చడమే లక్ష్యమని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా లింగారెడ్డిగూడలో రూ. 30 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపడుతున్నామన్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.