MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో ఇబ్బందిగా తయారైన ఊర కుక్కలను పట్టివేశారు. గ్రామంలో ఊర కుక్కల బెడద పెరిగిపోవడం, కుక్కలకు సంక్రమించిన చర్మవ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్కు చెందిన బ్లూ క్రాస్ సంస్థ సహకారంతో ఊర కుక్కలను బంధించి పట్టుకెళ్లారు. వాటికి శస్త్ర చికిత్సలు వైద్యం అందించి తీసుకురానున్నట్లు తెలిపారు.