ఇరాన్, అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం.. భారత్‌పై గ్యాస్ ఎఫెక్ట్ పడింది. అయితే, తిరుమలపై ఎఫెక్ట్ పడొద్దని టీటీడీ అధికారులు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)కు లేఖ రాశారు. తిరుమలకు గ్యాస్ సరఫరా ఆపొద్దని లేఖలో కోరారు. టీటీడీలో రోజుకు 5 టన్నుల గ్యాస్ వినియోగం ఉంటుందని తెలిపారు. టీటీడీ కోరినట్లు ప్రతి రోజు 5 టన్నుల గ్యాస్ సరఫరా చేస్తామని IOCL తెలిపింది.