SKLM: రణస్థలం మండలం జెఆర్ పురంలో సూర్య ఆసుపత్రి వద్ద ఈ నెల 15న సేవా ఫౌండేషన్ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షులు ఇ. తిరుపతిరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రక్తదానం చేయడం వలన మరొకరి ప్రాణదాతలు అవుతారని తెలిపారు. యువత, యువకులు ఈ విషయాన్ని గమనించి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.