CTR: జిల్లాలో ఈ ఏడాది 2,569 ఎకరాల్లో పట్టు సాగు విస్తరించింది. ప్రభుత్వం 3 వేల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పట్టు సాగు ద్వారా మంచి ఆదాయం వస్తుందని జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి పద్మమ్మ తెలిపారు. పట్టు మొక్క నాటడం నుంచి పట్టుగూళ్ల విక్రయాల వరకు ప్రోత్సాహక రాయితీలు అందిస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.