AKP: అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో పీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల ఈనెల 14న పర్యటించనున్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంతో పాటు, పలు సమస్యలపై మాట్లాడతారని ఎలమంచిలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అనంతరావు బుధవారం తెలిపారు. షర్మిల పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.