రైతులు సీఎం కేసీఆర్ (CMKCR), కేటీఆర్‌ను శాసన సభ ప్రాంగణంలో చెట్టుకు కట్టేసి, కొట్టి చంపిన తప్పులేదని టీపీసీసీచీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)విమర్మించారు. ధరణి పోర్టల్ (Dharani Portal) తెలంగాణ ప్రజలకు జీవన్మరణ సమస్య గా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ వెనకాల దొరలు, రాజులు ఉన్నారని, కేసీఆర్ దోపిడీ, దొంగతనానికి అడ్డు అదుపులేకుండా పోయిందని ఆరోపించారు.ధరణి వెనకాల దోపిడీని ప్రజలకు వివరిస్తామన్నారు. 75ఏండ్ల స్వాతంత్ర్య దేశంలో ఎప్పుడూ ఇంత దోపిడీ జరగలేదని రేవంత్ రెడ్డి అన్నారు.ILFS సంస్థ జాతీయ బ్యాంకుల(Banks)కు 90 వేల కోట్లకుపైగా నిండా ముంచిందని, అలాంటి దివాళ తీసిన సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ధరణి ఒప్పందం చేసుకుందని ఆయన తెలిపారు. ILFS సంస్థకు ధరణిని కట్టబెట్టారని తెలిపారు.
ప్రస్తుతం ధరణి పోర్టల్ శ్రీధర్ రాజు (Sridhar Raju) అనే వ్యక్తి చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ధరణి వచ్చాక అంటే 22 నెలల్లో 50 వేల కోట్ల లావాదేవీలు జరిగాయని రేవంత్ రెడ్డి చెప్పారు. ధరణికి వస్తున్న డబ్బులన్నీ శ్రీధర్ రాజు అకౌంట్ లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. భూమి రిజిస్ట్రేషన్ (Land registration) చేసుకునేందుకు ప్రజలు చెల్లిస్తున్న డబ్బులన్నీ శ్రీధర్ రాజు అకౌంట్ లోకి వెళ్తున్నాయని, ఒకవేళ రిజిస్ట్రేషన్ కాకపోతే చెల్లించిన అమౌంట్ తిరిగి రావడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల డేటా ఫిలిప్పిన్ దేశానికి వెళ్తోందని వెల్లడించారు.