నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర సహాయం అందించాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కేంద్రమంత్రి హెచ్.డి. కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని కేంద్రమంత్రి ఛాంబర్లో ఆయనతో భేటీ అయిన జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను వివరించారు. పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించమని కోరారు.