‘ధురంధర్ 2’తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పోటీపై దర్శకుడు హరీశ్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా విడుదల తేదీ తన ఒక్కడి చేతుల్లో ఉండదని, అది టీమ్ అంతా కలిసి తీసుకున్న నిర్ణయమని తెలిపాడు. ఉగాది సమయంలో రెండు, మూడు సినిమాలు విడుదలయ్యేంత ఖాళీ బాక్సాఫీస్ వద్ద ఉందని, అందుకే క్లాష్ గురించి ఆందోళన లేదని స్పష్టం చేశాడు.