KRNL: కోడుమూరు(మం) గోరంట్లలో శ్రీ లక్ష్మీ మాధవస్వామి తిరుణాల సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి వృశభాల బల ప్రదర్శన, ఎద్దుల బండలాగుడు కార్యక్రమాలను కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి ఇవాళ ప్రారంభించారు. గ్రామీణ సంప్రదాయాలను నిలబెట్టే ఇలాంటి కార్యక్రమాలు అభినందనీయమని MLA తెలిపారు. వృషభ యజమానులు గెలుపోటములు సమానంగా స్వీకరించాలని సూచించారు.