ATP: జిల్లా పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఎస్పీ పీ. జగదీష్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిపుణులచే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్ ప్రాణాంతకం కాదని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.