ATP: హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో గార్లదిన్నె మండల కేంద్రంలో బుధవారం ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎల్పీజీ గ్యాస్ పైపులైన్ లీకై అగ్నిప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ప్రయోగాత్మకంగా వివరించారు. విపత్తు సమయాల్లో ప్రజలు, ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేసే విధానాన్ని ప్రదర్శించారు.