E.G: దేవరపల్లి(M) మార్చి 16 నుంచి ప్రారంభం కాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు MEO R.S.V. అప్పారావు బుధవారం తెలిపారు. మండలంలోని 9 ప్రభుత్వ, 9 ప్రైవేట్ పాఠశాలల నుంచి మొత్తం 1,056 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 474 మంది బాలురు, 582 మంది బాలికలు ఉన్నారు. పరీక్షలు సజావుగా సాగేలా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.