TG: కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా కూలగొట్టిన ఇళ్లు కట్టించేవరకు.. పోరాడుతామని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. వెలుగుమట్లలో 1100 ఇళ్లు కూలగొట్టి.. ఇప్పుడు 311 ఇళ్లే కట్టిస్తామని ప్రభుత్వం చెప్పడంపై మండిపడ్డారు. అదీకూడా 100 గజాలు ఉంటే 75గజాలే ఇస్తున్నారని ధ్వజమెత్తారు. వాళ్లకు ఇచ్చేది ఇందిరమ్మ ఇళ్లు కాదు.. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.