»Wedding Day Surprise Have You Seen The Photos Of Nayanthara Children
Nayanthara: పెళ్లి రోజు సర్ప్రైజ్..నయనతార పిల్లల ఫోటోలను చూశారా!
సరోగసీ పద్దతి ద్వారా లేడీ సూపర్ స్టార్ నయనతార(nayanthara), విఘ్నేష్ శివన్(vignesh shivan) దంపతులు.. ఇద్దరు కవల పిల్లలకు తల్లి దండ్రులైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు పిల్లల ఫోటోలు బయటికి రాకుండా జాగ్రత్త పడింది ఈ జంట. ఇన్ని రోజులు చూసి చూపించనట్టుగా ఉన్న నయన్.. ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న నయన తార(nayanthara), విఘ్నేష్ శివన్(vignesh shivan).. గతేడాది జూన్ 9న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి ఈ జంట చాలా హ్యాపీగా సంసార జీవితాన్ని గడుపుతున్నారు. ఇక సరోగసీ ద్వారా ఇద్దరు కవల అబ్బాయిలకు జన్మ ఇవ్వడంతో.. వాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మన దేశంలో సరోగసీ వ్యవహారం వివాదం అయినప్పటికీ.. నయన్, విఘ్నేష్ మాత్రం చట్టపరంగానే ముందుకెళ్లారు. అయితే ఇప్పటి వరకు పిల్లల ఫోటోలను రివీల్ చేయలేదు నయన్. తాజాగా తమ మ్యారేజ్ ఫస్ట్ యానివర్శిరీ సందర్భంగా.. నయనతార తన ఇద్దరు పిల్లలు ఉయిర్, ఉలగమ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
ఇన్‌స్టాలో నయన్ తన ఇద్దరు పిల్లలను గుండెకు హత్తుకుని ఉన్న ఫోటోలను(photos) షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇక నయన్, విఘ్నేష్ జోడి మొదటి వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో.. సెలబ్రిటీస్, అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలాగే చాలా సంతోషంగా ఉండాలంటూ విష్ చేస్తున్నారు. అయితే మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చూపించుకుంటూ ఇద్దరు షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్‌లు కూడా వైరల్ అవుతున్నాయి.
నా జీవితానికి మూలం నువ్వే.. ఈ ఏడాది ఎన్నో అద్భుతమైన మూమెంట్స్‌తో గడిచింది.. అనేక ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి.. ఊహించని విధంగా ఎదురుదెబ్బలు తగిలాయి అంటూ.. నయనతార ఫొటోస్ షేర్ చేస్తూ.. విగ్నేష్ శివన్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నయనతార పలు చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలోను నటిస్తోంది.