TG: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కావూరి అనారోగ్యంతో కన్నుమూశారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. ఐదుసార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా వారు ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేశారని గుర్తుచేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.