KMR: ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు చేయూతనిస్తూ, కెఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో శనివారం రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ‘షీ టీమ్’ పి.సి. సౌజన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఎంపికైన 250 కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులతో కూడిన రేషన్ కిట్లను పంపిణీ చేశారు.