»Official Varun Tej Lavanya Tripathi Engagement Date Fixed
Official: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్.. త్వరలోనే పెళ్లి!
ఎట్టకేలకు అసలు మ్యాటర్ చెప్పేశారు వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు దీనిపై మెగా ఫ్యామిలీ స్పందించలేదు. ఫైనల్‌గా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేస్తూ.. అధికారిక ప్రకటన ఇచ్చేశారు.
వరుణ్ తేజ్(Varun Tej) చాలా కాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)తో లవ్‌లో ఉన్నాడనే రూమర్స్ వినిపిస్తునే ఉన్నాయి. కాస్ట్లీ డైమాండ్ రింగ్ ఇచ్చి లావణ్యను ప్రపోజ్ చేశాడని.. అక్కడ, ఇక్కడ షికార్లు చేస్తున్నారనే వార్తలు వస్తునే ఉన్నాయి. అయినా కూడా ఈ విషయం పై అటు నాగబాబు గానీ, వరుణ్ తేజ్ గానీ స్పందించలేదు. మెగా ఫ్యామిలీ కూడా ఎక్కడా నోరు మెదపలేదు. అప్పుడప్పుడు లావణ్య త్రిపాఠి తమ మధ్య అలాంటిది ఏంలేదని.. మేం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ.. రూమర్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రై చేసింది. అయినా కూడా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయినట్టు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరిగింది.
జూన్ 9న లావణ్యతో వరుణ్ తేజ్ నిశ్చితార్థం(engagement) జరగనుందని వినిపించింది. ఇక ఇప్పుడు అధికారికంగా వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్ డేట్‌ను ప్రకటించారు. రేపే ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ జరగబోతోంది. ఇదే రోజు వీళ్ల పెళ్లి తేదీ పై కూడా క్లారిటీ రానుంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మూడు ముళ్ల బంధంతో ఒక్కటవబోతున్నారు. గతంలో ఈ ఇద్దరు ‘మిస్టర్’, ‘అందరిక్షం’ అనే సినిమాల్లో కలిసి నటించారు. అప్పుడే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఇక ఇప్పుడు పెళ్లికి రెడీ అవుతున్నారు. ఇకపోతే.. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘గాండీవ ధారి అర్జున’ సినిమాతో పాటు.. మరో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి రీసెంట్గా పులి మేక వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చింది.