కృష్ణా: మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందని, గ్యాస్ ధరలు అమాంతంగా పెరిగిపోతాయని కొంతమంది ఆకతాయిలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను షేర్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.