KRNL: ఈనెల 23న కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సిరి శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, డివిజనల్, మునిసిపల్ కార్యాలయాల్లో వినతులు స్వీకరిస్తామని చెప్పారు. అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయాలని, meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవాలని ఆమె వెల్లడించారు.