ADB: ఆదిలాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా విజయవంతమైందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి 7500 మంది పాల్గొన్నట్లు చెప్పారు. రూ.13 వేల నుంచి రూ.45 వేల వరకు వేతనం ఉన్న ఉద్యోగాలకు యువత ఎంపికైందని వెల్లడించారు. 67 కంపెనీలు పాల్గొనగా వివిధ రంగాలలో 2100 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు.