MHBD: కొత్తగూడ మండల వ్యాప్తంగా మార్చి 1వ నుంచి 10వ తేదీ వరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది గడ్డిమందు తాగి ఆత్మహత్య, మిగతా 13 మంది సాధారణ కారణాల వల్ల చనిపోయారు. ఈ మరణాల శ్రేణి స్థానికులను భయాందోళనలోకి గురిచేస్తోంది. మరణాల గురించి ఊర్లో కూడా తెలియని ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో మండలంలో విషాద వాతావరణం నెలకొంది.