KDP: చక్రాయపేట మండలం సురభి గ్రామ రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ సహాయకులతో ఉద్యాన అధికారి రాఘవేంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో అందించే మామిడి ఫ్రూట్ కవర్లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీటిని వాడటం వల్ల చీడపీడల బెడద తగ్గి, కాయల పరిమాణం,నాణ్యత, రంగు మెరుగుపడుతుందని వివరించారు.