Hit tv Exclusive Interview With Pratibha Thakkadpally
Pratibha Thakkadpally: ప్రతిభ తక్కడపల్లి.. మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సర్. అంతర్జాతీయ స్థాయిలో 5 డిఫరెంట్ స్పోర్ట్స్ మెడల్స్ గెలుచుకున్నారు. అయినప్పటికీ తగిన గుర్తింపు, గౌరవం దక్కలేదని అంటున్నారు. ప్రతిభ తక్కడ పల్లితో హిట్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. చిన్నప్పటి నుంచి తనకు స్పోర్ట్స్ అంటే ఇష్టమని ఆమె చెబుతున్నారు. మైక్ టైసన్ వీడియో చూసి కిక్ బాక్సర్ కావాలని నిర్ణయం తీసుకున్నానని చెబుతున్నారు. 9వ తరగతిలో స్పోర్ట్స్‌లో 21 ప్రైజ్ వచ్చాయని తెలిపారు. టీమ్‌గా, ఇండివిడ్యువల్‌గా ఆడి పతకాలు గెలిచానని తెలిపారు. ఎక్కడ స్పోర్ట్స్ జరిగిన మెడల్ తీసుకురావాలని అమ్మ చెప్పేవారు అని గుర్తుచేశారు.
నాన్నకు స్పోర్ట్స్ అంటే బ్యాడ్ ఇంప్రెషన్ ఉండేదని గుర్తుచేశారు ప్రతిభ. హైదరాబాద్ వచ్చాక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని వివరించారు. 4 ఏళ్లు ప్రాక్టీస్ చేశానని.. చాలా గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. ముక్కు, కన్నుకు లెక్కలేనన్ని సార్లు గాయాలు అయ్యాయని వివరించారు. తన మెడ తిరగనివ లేదని పాత రోజులను గుర్తుచేశారు. మోకాలి నొప్పి వచ్చిందని.. డాక్టర్ రెండేళ్లు నడవలేరని చెప్పారని వివరించారు. అయినప్పటికీ కష్టపడ్డానని.. రెండేళ్లలో అంతర్జాతీయ స్థాయిలో రెండు గోల్డ్ మెడల్స్ కొట్టానని చెప్పారు. ఈజీగా 85-90 కేజీల బరువు ఉన్న వారిని ఎత్తగలనని ప్రతిభ చెప్పారు. కెరీర్, ఒడిదుడుల గురించి హిట్ టీవీ ప్రతినిధికి వివరించారు.