W.G: చిట్టవరం, నవరసాపురం గ్రామాల్లోని బాణాసంచా విక్రయ కేంద్రాలను భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మూడు బాణాసంచా షాపులను స్వయంగా పరిశీలించి, నిల్వ ఉన్న బాణాసంచా వివరాలను, అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. బాణాసంచా నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలని కోరారు.