మార్చి 9న జరిగిన 12వ తరగతి మ్యాథమెటిక్స్ పరీక్షా పత్రంలో వింత క్యూఆర్ కోడ్ వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై CBSE అధికారులు తక్షణమే స్పందిస్తూ బహిరంగ క్షమాపణలు కోరారు. ఇది కేవలం ప్రింటింగ్ ఎర్రర్ మాత్రమేనని, ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని బోర్డు స్పష్టం చేసింది. అయితే, ఈ తప్పు వల్ల లీకేజీ జరిగినట్లు కాదని, ఇలాంటి పొరపాట్లు పునరావృతం కావని పేర్కొన్నారు.