ASF: వాంకిడి మండలం ఖిరిడి గ్రామంలో మంగళవారం కళాజాత బృందంచే కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి DMHO సీతారాం హాజరై పలు సూచనలు చేశారు. శరీరంపై రాగిరంగులో మచ్చలు కనిపిస్తే వెంటనే PHCకి వెళ్లి డాక్టర్ సూచనలు తీసుకోవాలని, కుష్ఠు వ్యాధి కోసం PHCలో ఉచిత మందులు లభిస్తాయన్నారు. 6 నెలల వైద్యం ద్వారా వ్యాధి నయమవుతుందన్నారు.