»New Rules For Investors In Post Office Those Documents Are Mandatory
Post Office New Rules: పోస్టాఫీసులో పెట్టుబడిదారులకు కొత్త రూల్స్..ఆ డాక్యుమెంట్స్ తప్పనిసరి
ఇండియన్ పోస్ట్ తమ ఖాతాదారుల కోసం కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. కొత్తగా రూపొందించిన ఈ కేవైసీ రూల్స్ వల్ల ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేవారికి తీవ్ర ఇబ్బందులు తలెత్తవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
పోస్టాఫీస్ పొదుపు పథకాల్లో(post office savings schemes) పెట్టుబడులు పెట్టేవారు చాలా మంది ఉంటారు. గ్రామీణులు ఎక్కువగా పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్ మీదనే ఆధారపడి ఉంటారు. పోస్టాఫీసు పథకాలు పొదుపు, పెట్టుబడి కోసం అనేక ఎంపికలను ప్రజల ముందుకు తీసుకొచ్చాయి. అయితే ఈ మధ్యనే ఆ పథకాలను నియంత్రించే పెట్టుబడి నిబంధనలు అమలులోకి వచ్చాయి. చిన్నపొదుపు పథకాల్లో ఉన్నవారి కోసం మీ కస్టమర్‌ను తెలుసుకోండి అంటూ ఇండియా పోస్ట్(Indian Post) ఓ నోట్‌ను రిలీజ్ చేసింది.
ఇండియా పోస్ట్ రిలీజ్ చేసిన ఆ నోట్(Circular Release)లో కేవైసీ నిబంధనల(KYC rules)లో మార్పుల గురించి తెలిపింది. పోస్టాఫీస్ తీసుకొచ్చిన ఆ రూల్స్(Post Office New Rules) ఇప్పుడు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టేవారికి కాస్త ఇబ్బందిగా మారనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పోస్టాఫీసు స్కీముల్లో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేవారు కేవైసీతో పాటు ఆదాయ రుజువును కూడా సమర్పించాలి. ఇప్పటికే ఇన్వెస్టర్ల(Investers) నుంచి ఆదాయ రుజువులను సేకరించాలని తపాలా శాఖ అన్ని బ్రాంచులకు ఆదేశాలు జారీ చేసింది.
రూ. 50,000కు మించకుండా ఏదైనా స్కీమ్‌లో ఖాతాను తెరిచి, అన్ని పోస్టాఫీసు స్కీమ్‌ల(Post Office schemes)లో ఈ థ్రెషోల్డ్ కంటే తక్కువ బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేసే పెట్టుబడిదారులు తక్కువ-రిస్క్ ఇన్వెస్టర్లుగా పరిగణించనున్నట్లు తపాలా శాఖ తెలిపింది. రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తంతో ఖాతాలను ప్రారంభించే కస్టమర్లు రూ. 10 లక్షల కంటే తక్కువగా ఉన్నవారు మిడిల్-రిస్క్ పెట్టుబడిదారులుగా, రూ.10 లక్షల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, రూ. 50,000 కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, అవి మీడియం-రిస్క్‌గా వర్గీకరించింది. పెట్టుబడి రూ.10 లక్షల థ్రెషోల్డ్‌ను మించిపోయిన తర్వాత, సంబంధిత కస్టమర్ హై-రిస్క్ ఇన్వెస్టర్‌గా పరిగణిస్తారని, వారికి మరింత కఠినమైన నిబంధనలు(Rules) వర్తించనున్నట్లు తపాలా శాఖ వెల్లడించింది.