పాకిస్తాన్ దేశవాళీ క్రికెటర్, సియాల్కోట్ స్టార్ ఆల్రౌండర్ షహజైబ్ భట్టి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పీసీబీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ 24 ఏళ్లకే భట్టి రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశీయ క్రికెట్లో రాజకీయ జోక్యం, అవినీతి ఎక్కువైందని అతడు ఆరోపించాడు. అస్తవ్యస్తమైన వ్యవస్థ కారణంగా తాను క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు షహజైబ్ వెల్లడించాడు.